Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 22, 2022 | 08:30 AM

Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి..

Tooth Alignment :  మనిషి ముఖానికి చిరునవ్వే ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది. నవ్వు మనిషిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఎత్తు పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, విరిగిపోయిన ముందు పళ్ళు, పళ్ళ మధ్య పెద్ద ఖాళీలు ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్ని, అందాన్నే కాదు మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి. మరి అలాంటి పళ్లను సరిచేయడానికి క్లిప్ ట్రీట్మెంట్, టూత్ అలైన్మెంట్ చేస్తారు.

ఇటీవల ఓ సర్వే ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు ఈ టూత్ అలైన్లను ఉపయోగిస్తున్నారు. ఈ అలైన్లు అసమానంగా పెరుగుతున్నదంతాలను నిటారుగా చేస్తాయి. అవి సమానంగా పెరగడానికి దోహదపడతాయి. ఈ అలైన్లు ధరించే వారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చాలా సింపుల్ గా, అందంగా ఉండేలా డిజైన్ చేశారు. వీటిని దంతాలపై ధరించినప్పుడు దంతాల మీద కొంత ఒత్తిడిని కలిగించి, అవి క్రమ పద్ధతిలో పెరగడానికి సహాయ పడతాయి.

Sun Bath Therapy : సన్ బాత్ థెరఫీ గురించి తప్పక తెలుసుకోండి.. ఎంత మంచిదో ఆరోగ్యానికి..

టూత్ అలైన్లు ధరించడం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగదు. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తీసేయవచ్చు. అవి గాజులాగ పారదర్శకంగా ఉంటాయి కాబట్టి వాటిని ధరించినట్లు అంతా తొందరగా పసిగట్టలేరు. ఈ టూత్ అలైన్లు ధరించడం వల్ల చిగురు వాపు, పంటి నొప్పి, పుచ్చిపోయే పళ్ళు లాంటివి రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. దంతాలపై దాడి చేసే పలు వ్యాధులను ఈ టూత్ అలైన్ల సాయంతో నివారించవచ్చు.