Sugar Ball Jewellery : షుగర్ బాల్ జ్యువెల్లరీ గురించి మీకు తెలుసా??

ధరించే ఆభరణాలలో చాలా రకాలు ఉంటాయి. అందరూ బంగారు నగలు వేసుకోరు, కొంతమంది స్టైల్, ఫ్యాషన్ తో ఉన్నవి కూడా వేసుకుంటారు. ఆలాంటి వాటిల్లో "షుగర్ బాల్ జ్యూయలరీ" అనేది.............

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 06:53 PM

Sugar Ball Jewellery : షుగర్ బాల్ జ్యువెల్లరీ గురించి మీకు తెలుసా??

Sugar Ball Jewellery :  పండుగలు రాగానే ఆడపిల్లలు, మహిళలు, పిల్లలు అందరూ కూడా అందమైన దుస్తులతో, రకరకాల ఆభరణాలు వేసుకుంటూ ఉంటారు. వారు ధరించే ఆభరణాలలో చాలా రకాలు ఉంటాయి. అందరూ బంగారు నగలు వేసుకోరు, కొంతమంది స్టైల్, ఫ్యాషన్ తో ఉన్నవి కూడా వేసుకుంటారు. ఆలాంటి వాటిల్లో “షుగర్ బాల్ జ్యూయలరీ” అనేది ఒక రకమైన ఆభరణాలు. వీటిని ఎక్కువగా మహారాష్ట్రలో, ఉత్తరాదిలో ధరిస్తారు. వీటిని ఎక్కువగా నవ వధువులు మరియు పిల్లలు మాత్రమే ధరిస్తూ ఉంటారు.

షుగర్ బాల్ ఆభరణాలను గసగసాలు లేదా నువ్వులను పంచదారతో కలిపి సన్నని మంట మీద పాకం వచ్చేలా తయారు చేస్తారు. పాకం బాగా చిక్కబడేలా చేసి దానితో బాల్స్ షేప్స్, తీగల షేప్స్ వచ్చేలా చేసి వాటితో ఆభరణాలను తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన ఆభరణాలను నూతన వధువు ధరిస్తే వారి భవిష్యత్ జీవితం ఆనందంగా ఉంటుందని అక్కడి వారి నమ్మకం.

Walnuts : వాల్‌నట్స్ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసా??

ఈ షుగర్ బాల్ జ్యూయలరీలోనే పువ్వులతో చేసిన ఆభరణాలను కూడా ధరిస్తారు. వివాహ వేడుకల్లో ధరించే పువ్వుల ఆభరణాలను పండుగల నాడు కూడా ధరిస్తున్నారు. పువ్వులతో హారాలు, చౌక్ లు, జూకాలు, గాజులు ఇంకా చాలా రకాల వెరైటీలు, డిజైన్స్ లో చేసి వాటిని అలంకరించుకుంటున్నారు. ఇలాంటి ఆభరణాలు ఇప్పుడు ఆన్లైన్ లోనూ అమ్ముతున్నారు. ఇలా షుగర్ బాల్ ఆభరణాలు తక్కువ రేటుకి దొరకడం, అందంగా, ఫ్యాషన్ గా ఉండటంతో ఇప్పుడు చాలా మంది వీటికి ప్రిఫరెన్స్ ఇస్త్తున్నారు. మీరు కూడా షుగర్ బాల్ జ్యూయలరీ ట్రై చేశారా? లేదంటే ఇప్పుడే కొనుక్కొని వేసుకొని చూడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని తెచ్చిపెడతాయి.