Moisturizer vs Sun Screen : సన్ స్క్రీన్ కి, మాయిశ్చరైజర్ కి గల తేడా ఏంటో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

November 27, 2022 | 10:43 AM

Moisturizer vs Sun Screen : సన్ స్క్రీన్ కి, మాయిశ్చరైజర్ కి గల తేడా ఏంటో తెలుసా??

Moisturizer vs Sun Screen :  కొంతమందికి సన్ స్క్రీన్ కి, మాయిశ్చరైజర్ కి మధ్య తేడా తెలియదు. రెండు ఒకటే అనుకుంటారు. మనం కూడా ప్యాక్ మీద చూడకపోతే ఒక్కోసారి రెండు ఒకటే అని పొరబడతాం. సన్ స్క్రీన్ లోషన్ ఎండాకాలం మాత్రమే వాడతారు కొంతమంది, అలాగే మాయిశ్చరైజర్ ని సన్ స్క్రీన్ బదులు కూడా వాడేస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు రాసుకోవాలి అనేది కూడా తెలియాలి.

సన్ స్క్రీన్ అనేది ఎపుడైనా మన ముఖానికి, చేతులకి, కాళ్ళకి రాసుకోవచ్చు. సన్ స్క్రీన్ ని ఎండ తగిలే చోట రాసుకోవాలి. సన్ స్క్రీన్ వాడటం వలన చర్మంపై నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి మరియు ఎండ నుండి వెలువడే కిరణాల నుండి కాపాడుతుంది. ఎప్పుడైనా సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే రాసుకోకూడదు. కనీసం రెండు గంటల తరువాత రాసుకోవాలి. ఇలా చేస్తే చెమటకి సన్ స్క్రీన్ పోయిన ఇంకొక లేయర్ రాయడం వలన ఎండ నుండి చర్మాన్ని కాపాడుతుంది.

Drinks in Winter : చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఈ డ్రింక్స్ తాగండి..

మాయిశ్చరైజర్ అనేది చర్మం పొడిబారకుండా ఉంచుతుంది. మాయిశ్చరైజర్ రాసిన తరువాత దానిపై సన్ స్క్రీన్ కూడా రాసుకోవచ్చు. మాయిశ్చరైజర్ అనేది స్నానానికి ముందు లేదా రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. దీని వలన చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది. ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రెండూ కూడా మన చర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. ఎండ నుండి సన్ స్క్రీన్ మన చర్మాన్ని కాపాడుతుంది. శీతాకాలంలో మన చర్మాన్ని మాయిశ్చరైజర్ కాపాడుతుంది. రెండింటిని మన చర్మాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు వాడుకోవాలో అపుడు ఉపయోగించుకోవాలి.