Date Palm : ఖర్జురాలు తినడం ఎంత అవసరమో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

October 9, 2022 | 01:42 PM

Date Palm : ఖర్జురాలు తినడం ఎంత అవసరమో తెలుసా??

Date Palm :  మనకు విరివిగా దొరికే వాటిల్లో ఖర్జురాలు ఒకటి. ఎండు ఖర్జురా, ఖర్జురా పండు ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు కచ్చితంగా ఖర్జురాలు రోజూ తినాలి. ఖర్జురాలలో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషక విలువలు ఉన్నాయి.

ఖర్జురాలు తినడం వల్ల ఉపయోగాలు :

*వేసవికాలంలో చంటిపిల్లలకు నానపెట్టిన ఖర్జురా నీటిని తాగిస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
*రాత్రి పూట ఒక గ్లాస్ నీళ్లల్లో నాలుగు ఎండుఖర్జురాలు నానబెట్టి ఆ నీరు ఉదయం తాగితే మలబద్దకం తగ్గుతుంది.
*ప్రతిరోజూ ఖర్జూర తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
*ఖర్జురా తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
*ఖర్జూరంలో పాస్ఫరోస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. వీటి వల్ల ఎముకలు ధృడంగా అవడమే కాకుండా కండరాల సమస్య ఉంటే తగ్గుతుంది.
*ఖర్జూరం ప్రతిరోజూ తినడం వల్ల కళ్లను పూర్తి ఆరోగ్యవంతంగా చేస్తాయి .
*ఆయుర్వేదం ప్రకారంగా చూసుకుంటే ఆరోగ్యకరమైన గుండె కోసం ఖర్జురాలు చాలా మంచివి. *ఖర్జురాలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.