Sweet Corn : మొక్కజొన్న తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా??

Kaburulu

Kaburulu Desk

October 25, 2022 | 08:40 AM

Sweet Corn : మొక్కజొన్న తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా??

Sweet Corn :  మొక్కజొన్న మన దేశంలో విరివిగా అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. మొక్కజొన్నని రకరకాలుగా తింటారు. ఉడకపెట్టుకొని, కాల్చి, స్వీట్స్, హాట్స్, కూరలు, గార్నిష్.. ఇలా రకరకాలుగా మనం మొక్కజొన్నని తింటాము. చాలా మంది మొక్క జొన్నని తినడానికి ఇష్టం చూపిస్తారు కూడా. మొక్కజొన్న తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

*మొక్కజొన్నలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.
*మొక్కజొన్న మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
*జంక్ ఫుడ్స్ కి బదులుగా మొక్కజొన్న గింజలను స్నాక్స్ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* మొక్కజొన్నలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పీచుపదార్థం పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరచి మలబద్ధకం సమస్యను నిర్ములిస్తుంది.
*మొక్కజొన్న గింజలలో ఐరన్ , కాపర్ , ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
*ఎముకలు గట్టి పడేందుకు కావలసిన పోషకాలు మొక్కజొన్నలు ఉన్నాయి.
*మొక్కజొన్నలు ఎక్కువగా తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గిస్తుంది.