Sesame : నువ్వులు తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 3, 2022 | 05:35 PM

Sesame : నువ్వులు తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

Sesame :  నువ్వులు అనేవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా చలిమికాలంలో నువ్వులు తినడం వలన మన శరీరానికి వేడిని అందిస్తాయి. మన పెద్దవాళ్ళు చెసే పిండివంటల్లో నువ్వులు వేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. మన తెలుగు పిండి వంటకాల్లో చాలా వరకు నువ్వులు భాగంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే మన పెద్దలు ముందే ఇలా ఆలోచించారు.

Periods Pain : పీరియడ్స్ లో నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు

* నువ్వులు రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే హార్ట్ కి సంభందించిన సమస్యలను రాకుండా చేసుకోవచ్చు.
* నువ్వులలో ఉండే మెగ్నీషియం మనకు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి సహాయపడుతుంది.
* నువ్వులలో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది.
* మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు నువ్వులు రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే వాటిని తగ్గించుకోవచ్చు.
* ఐరన్, కాపర్, జింక్, విటమిన్ బి6 వంటివి నువ్వుల్లో ఉన్నాయి. అవి మనకు థైరాయిడ్ రాకుండా కాపాడుతుంది.
* రుతుక్రమం సమయంలో మహిళలు చాలా రక్తాన్ని కోల్పోతారు. కాబట్టి అటువంటి సమయంలో నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసి తినిపిస్తారు. దీనిలో ఉండే ఇనుము రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది రక్తహీనతను నివారిస్తుంది.
* నానబెట్టిన నువ్వులు లేదా మొలకలు వచ్చిన నువ్వులు తినడం వలన ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
* నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది. జీర్ణ సమస్యలు రాకుండా ఉండేలా చేస్తుంది.