Ganji : గంజి తాగితే ఇన్ని ఉపయోగాలా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Kaburulu

Kaburulu Desk

September 10, 2022 | 02:28 PM

Ganji : గంజి తాగితే ఇన్ని ఉపయోగాలా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Ganji :  ఇపుడు ప్రస్తుతం అందరూ కుక్కర్ లోనే అన్నం వండుతున్నారు కాబట్టి గంజి ఎవరు తయారు చెయ్యట్లేదు, ఒకవేళ స్టవ్ మీద వండినా గంజి ఎవరూ తీయట్లేదు. పాత కాలంలో అన్నం ఫైనల్ స్టేజిలో ఉన్నప్పుడు అందులోంచి గంజి నీళ్ళని తీసేవారు. ఆ గంజి నీళ్ళకి ఆవకాయ, ఉల్లిపాయ, పర్చిమిర్చి కలిపి తినేవాళ్లు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

గంజిలో అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, ఎమినో ఆమ్లాలు, కార్బోహైడ్రాట్స్ ఉన్నాయి. గంజి కావాలంటే అన్నాన్ని కుక్కర్ లో కాకుండా విడిగా వండాలి. అన్నం ఉడికిన తర్వాత ఫైనల్ స్టేజిలో ఉన్నప్పుడు మిగిలిన నీరే గంజి. దాన్ని సపరేట్ గా బయటకి తీసుకోవాలి. లేదా తక్కువ బియ్యానికి ఎక్కువ నీటిని కలిపి ఉడికించాలి అపుడు అది జావలా తయారవుతుంది దీనిని కూడా గంజిలా తీసుకోవచ్చు. గంజి నీళ్ళకి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి ఉల్లిపాయ, ఏదైనా పచ్చడి కలిపి తింటే కూడా చాలా బాగుంటుంది.

Health Benefits of Almonds : బాదంపప్పు తినడం వల్ల ఇన్ని లాభాలా..?

గంజి నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు:-

* మోషన్స్ అయినపుడు గంజిని తాగితే మనకు నీరసం తగ్గుతుంది.
* వాంతులు, జ్వరం తగ్గించడానికి గంజి ఉపయోగపడుతుంది.
* గంజి మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుతుంది.
* కడుపులో మంటను గంజి తగ్గిస్తుంది.
* గంజిలో ఉండే కార్బోహైడ్రాట్స్ శరీరానికి తొందరగా శక్తిని అందిస్తాయి.
* గంజి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* గంజి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. గంజిని తలకు పట్టిస్తే అది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా పెరిగి మెరిసేలా చేస్తుంది.
* గంజి చర్మ వ్యాధులను తగ్గించి చర్మం మృదువుగా, యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
* గంజి మన ముఖంపై ముడతలు తగ్గేలా చేస్తుంది.
* నీటిలో కొద్దిగా గంజి నీరు కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

గంజి తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన ముందు తరాల వాళ్ళు గంజిని తాగేవారు. ఇటీవల కొన్ని హోటల్స్ లో కూడా మనకి ఈజీగా దొరికే గంజిని అధిక రేటు పెట్టి గంజి సూప్ అని అమ్ముతున్నారు. అందుకే మనం కూడా గంజిని ఆహారంలో భాగం చేసుకొని ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.