Jonna Rotte : జొన్నలతో చేసిన రొట్టెలు తినండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 06:51 PM

Jonna Rotte : జొన్నలతో చేసిన రొట్టెలు తినండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా తెలుసా??

Jonna Rotte :  ఆరోగ్యానికి జొన్నలు చాలా మేలు చేస్తాయి. జొన్నలతో చేసిన రొట్టెలు తినడం వలన మనకు తొందరగా కడుపు నిండిపోతుంది. జొన్నల్లో ఉండే పీచు పదార్థం వలన మనకు తొందరగా జీర్ణమవుతుంది. గోధుమలతో చేసిన రొట్టెలు తింటే తొందరగా కడుపు నిండుతుంది కానీ అవి తొందరగా అరుగవు. రొట్టెలు తినాలనుకునే వారు రోజూ గోధుమలతో చేసినవి కాకుండా జొన్నలతో చేసినవి కూడా తింటే ఎంతో ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు.

* జొన్నల్లో ఎక్కువగా ఉండే అమైనో ఆమ్లాలు మన శరీరానికి ప్రోటీన్లను అందిస్తాయి.
* జొన్నల్లో ఉండే పోషకపదార్థాలు మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడతాయి.
* జొన్నల్లో ఉండే నియాసిన్ శరీరంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
* జొన్నల్లో ఉండే ఫైటోన్యూట్రియంట్లు గుండె జబ్బులకు తొందరగా గురి కాకుండా చేస్తాయి.
* జొన్న రొట్టెలు నూనె లేకుండా మంట మీద కాల్చడం వలన దీనిలోని ఇనుము మన శరీరానికి అందుతుంది. ఇది రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.
* జొన్నల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.
* జొన్నలు తినడం వలన మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
* రొమ్ము కాన్సర్ ను కూడా రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.

అందుకే మీ ఆహారంలో జొన్నలని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.