Sun Bath Therapy : సన్ బాత్ థెరఫీ గురించి తప్పక తెలుసుకోండి.. ఎంత మంచిదో ఆరోగ్యానికి..

Sun Bath Therapy : సూర్యుడు లేకుండా భూమిపై జీవితం ఊహించలేనిది. మన ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సహజ కాంతి చాలా ముఖ్యమైనది. సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో సహాయపడుతుంది. సూర్యరశ్మి తగినంతగా పొందకపోవడం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో సన్ బాత్ చేయడంవల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి.
సూర్యరశ్మిలో కాసేపు కూర్చోవటాన్ని సన్ బాత్ అంటారు. నిజానికి చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సన్ స్క్రీన్ లేకుండా కాసేపు ఎండలో గడిపితే తేడాను మీరే గమనిస్తారు. అలాగని సూర్యరశ్మి మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఎండలో ఉంటే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి.
Biryani Leaf Tea : బిర్యానీ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చు తెలుసా.. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..
సూర్యరశ్మితో మనం చేసే సన్ బాత్ వల్ల ఉన్న ఉపయోగాలు :
*రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఈ సన్ బాత్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
* నిద్రను మెరుగుపరుస్తుంది
మన శరీరం ఉత్పత్తిచేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను ప్రోత్సహించడానికి చాలా చాలా అవసరం. పలు పరిశోధనల ప్రకారం ఉదయాన్నే ఒక గంట పాటు సహజ కాంతిని పొందడం వల్ల మీ నిద్ర మెరుగుపడుతుంది.
*నిరాశను పోగొడుతుంది
ఎండలో కాసేపు గడిపిన తరువాత నిరాశా నిస్పృహ లక్షణాలు చాలా వరకు తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎండ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
*విటమిన్ డి అందిస్తుంది
మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో నిలబడితే చాలు. నిజానికి మన దేశంలో సూర్యరశ్మికి ఎలాంటి లోటు లేకున్నా విటమిన్ డి లోపంతో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. ఈ విటమిన్ డి శరీరాన్ని ఫ్లూతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించబడుతుంది.
* క్యాన్సర్ ను నివారించవచ్చు
ఇది నమ్మశక్యంగా లేకపోయినా సన్ బాత్ తో ఎన్నో రకాల క్యాన్సర్ ల ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే విటమిన్-డి లేకపోవడం వల్ల రొమ్ము, గర్భాశయ కాన్సర్ లు వచ్చే ప్రమాదం ఉంది. మన చర్మం సూర్యరశ్మిలో ఉన్నప్పుడు విటమిన్-డి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కొన్ని క్యాన్సర్లను నివారించబడతాయి.
*రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అంటువ్యాధులు, సోరియాసిస్ వంటి ఎన్నో స్వయం ప్రతిరక్షక వ్యాధులతో పోరాడటానికి సూర్యరశ్మి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి ఎన్నో వ్యాధులతో పోరాడటానికి ఉదయం 10 నుంచి 15 నిమిషాలు సన్ బాత్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.