Lady Finger : బెండకాయ తినడం వలన కలిగే లాభాలు తెలుసా..?

 బెండకాయతో కూర, పులుసు, వేపుడు, బెండకాయ 65 ఇంకా చాలా రకాలుగా వండుకుంటూ ఉంటాము. బెండకాయ ఎంతో రుచిగా ఉంటుంది అయితే ఎక్కువగా బెండకాయ తినడం వలన మనం ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.........

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 04:14 PM

Lady Finger : బెండకాయ తినడం వలన కలిగే లాభాలు తెలుసా..?

Lady Finger :  బెండకాయతో కూర, పులుసు, వేపుడు, బెండకాయ 65 ఇంకా చాలా రకాలుగా వండుకుంటూ ఉంటాము. బెండకాయ ఎంతో రుచిగా ఉంటుంది అయితే ఎక్కువగా బెండకాయ తినడం వలన మనం ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కాకపోతే కొంతమంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ బెండకాయలని నీళ్లలో కడిగి కొన్ని గంటలు ఆరబెడితే ఆ జిగురు తగ్గుతుంది. ఆ తర్వాత కట్ చేసి మనకి నచ్చిన వంటలో వాడుకోవచ్చు బెండకాయలని.

Sandwich : శాండ్ విచ్.. ఇలా చేసుకొని అలా తినేయండి..

బెండకాలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి..

* బెండకాయలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
* పెద్ద పేగు కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ వంటివి తగ్గించే పోషకాలు బెండకాయలో అధికంగా ఉంటాయి. కాబట్టి బెండకాయ కాన్సర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
* దంతక్షయాన్ని తగ్గించడానికి కూడా బెండకాయ సహాయపడుతుంది.
* బెండకాయ గర్భిణులకు మంచి ఆహరం దానిలో ఉండే ఫోలేట్ బిడ్డ మెదడు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఫోలిక్ యాసిడ్ నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది.
* బెండకాయలు జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.
* బెండకాయను ఎక్కువగా తింటే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
* బెండకాయలో ఉండే క్యాల్షియం ఎముకలు గట్టిగా ఉండడానికి తోడ్పడుతుంది.
* బెండకాయలో ఉండే ఫైబర్ మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
* బెండకాయ తినడం వలన చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది.