Walnuts : వాల్‌నట్స్ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసా??

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్రై ఫ్రూట్స్ వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ డ్రైఫ్రూట్స్ తినడానికి అలవాటు పడ్డారు. ఈ వాల్‌నట్స్ రుచికరంగా కూడా ఉంటుంది...............

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 06:41 PM

Walnuts : వాల్‌నట్స్ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసా??

Walnuts :  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్రై ఫ్రూట్స్ వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ డ్రైఫ్రూట్స్ తినడానికి అలవాటు పడ్డారు. వాల్‌నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. వీటిలో ఫైబర్ కంటెంట్ తో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ వాల్‌నట్స్ రుచికరంగా కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కువమంది తమ డైట్ లో చేర్చిన డ్రైఫ్రూట్ లో వాల్‌నట్స్ ఒకటి. దాదాపు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఈ వాల్‌నట్స్ పరిష్కారం చూపిస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ వాల్ నట్స్ ను పచ్చిగా కాకుండా నానబెట్టి తింటే అవి శరీరానికి సులభంగా జీర్ణమవుతాయి.

వాల్‌నట్స్ రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

*మెదడు ఆకారంలో ఉండే ఈ వాల్ నట్స్ లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరం కూడ సులభంగా జీర్ణించుకుంటుంది.
*వాల్‌నట్స్ లో అధిక కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్స్ , క్యాల్షియం, ఐరన్ ఉంటాయి.
*ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన చిరుతిండి వాల్‌నట్స్.
*డయాబెటిక్ పేషెంట్స్ రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
*వాల్ నట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ముఖ్యంగా నీళ్లలో నానబెట్టి రోజు తింటే పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.
*వాల్ నట్స్ లో ఉండే క్యాల్షియం, పొటాషియం,ఐరన్, కాపర్ & జింక్ శరీరంలోని జీవనక్రియను పెంచి అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. ఇవి తిన్నాక చాలా సేపు ఆకలిగా ఉండదు.
*వాల్‌నట్స్ మంచి నిద్రకు తోడుపడుతుంది. వాల్ నట్స్ లోని మెలటోనిన్ మంచి ప్రశాంతమైన నిద్రను అందజేస్తుంది.
*రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎముకలు మరియు దంతాలు బలోపేతంగా మారుతాయి.
*శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వాల్‌నట్స్ సహాయపడుతుంది.
*కొలెస్ట్రాల్ స్థాయిని స్థిరంగా ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది వాల్‌నట్స్.
*రోజుకి రెండు వాల్‌నట్స్తిని మంచి ఆరోగ్యంన్ని పొందొచ్చు మనం.