Benefits of Mushrooms : మష్రూమ్స్ తినడం వాళ్ళ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 05:00 PM

Benefits of Mushrooms : మష్రూమ్స్ తినడం వాళ్ళ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

Benefits of Mushrooms :  భారత్ లో పుట్టగొడుగులు విచ్చలవిడిగా లభిస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యం కోరుకునే నేపథ్యంలో వీటి వినియోగం పెరగడం వల్ల మష్రూమ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కావున ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్ లో విటమిన్స్, మినరల్స్, ఎమినో ఆసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

కొంతమంది దీని ప్రయోజనాలను తెలుసుకోకుండా కేవలం దాని రుచి చూసి తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ వీటిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్స్, రాగి, సెలీనియం లాంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్ సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. పుట్ట గొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92 % నీటిని కలిగి ఉంటాయి.

White Rice Vs Brown Rice : వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏది తినాలి??

జీర్ణక్రియ సమస్యలతో పోరాడే వారు తప్పనిసరిగా పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి. పుట్టగొడుగులను తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండెకు సంబంధించిన ప్రయోజనాలను చేకూరుస్తుంది. పుట్టగొడుగులు తినడం వల్ల క్యాన్సర్, థైరాయిడ్ వంటి వ్యాధుల నుండి బయటపడవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా మష్రూమ్స్ ని తీసుకోవాలి. పుట్టగొడుగులను తినడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. అందుకే రుచి కోసం మాత్రమే కాక పుట్ట గొడుగులని ఆరోగ్యం కోసం కూడా తీసుకోవాలి.