Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 03:48 PM

Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

Jaggery :  మన ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో కొన్నిమన వంట ఇంటి చిట్కాలు పాటిస్తే సులువుగా కొన్ని జబ్బులు బారినుండి బయటపడవచ్చు. అలాంటి చిట్కా ఔషధాలలో బెల్లం ఒకటి. పంచదార తెలియక ముందు స్వీట్ అంటే అందులో బెల్లమే ఉండేది. ఇప్పటికీ కొన్ని సంప్రదాయ వంటలలో బెల్లం వేస్తే వచ్చే రుచే వేరు. అన్నం పొంగలి, సున్నుండలు, పల్లీ చెక్క లాంటివి బెల్లంతో చేసే వంటల రుచి అద్భుతంగా ఉంటుంది. అరిసెలు, ఖజ్జికాయలు ఇలా బెల్లం పిండితో చేసే వంటల రుచి వేటితో సాటి రాదు.

రుచియే కాక బెల్లం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ప్రత్యేకంగా శీతాకాలంలో బెల్లం తినడం వల్ల మేలు కలుగుతుంది. చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యుల సూచన. మన ఆహారంలో, స్వీట్స్ లో పంచదార బదులు బెల్లాన్ని భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు.

Betel Leafs : తమలపాకులు తినడం అలవాటు చేసుకోండి..

*బెల్లం ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసి ఆరోగ్యంగా మార్చటంలో సహకరిస్తుంది.
*హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు బెల్లం తినాలని పేర్కొంటున్నారు.
*బెల్లం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలని ధృడంగా చేయడంలో సాయపడతాయి.
*బెల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
*శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటకు పంపేసి శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
*స్త్రీలకు వచ్చే నెలవారీ సమస్యల్లో బాధని తాగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బెల్లాన్ని రోజు వారి డైట్ లో తప్పకుండ ఉండేలా చూసుకోవాలి.