Gym : జిమ్ కి వెళ్లాలని అనుకొని వెళ్లడం లేదా??

చాలా మంది న్యూ ఇయర్ రాగానే జిమ్ కి వెళ్లి మంచి ఫిజిక్ గా కనబడాలని అందరూ అనుకుంటారు. కొంతమంది అయితే ముందే డబ్బులు మొత్తం కట్టేసి తర్వాత వెళ్లడం మానేస్తారు. జిమ్ కి వెళదాం అనుకున్నా కానీ..........

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 03:00 PM

Gym : జిమ్ కి వెళ్లాలని అనుకొని వెళ్లడం లేదా??

Gym :  చాలా మంది న్యూ ఇయర్ రాగానే జిమ్ కి వెళ్లి మంచి ఫిజిక్ గా కనబడాలని అందరూ అనుకుంటారు. కొంతమంది అయితే ముందే డబ్బులు మొత్తం కట్టేసి తర్వాత వెళ్లడం మానేస్తారు. జిమ్ కి వెళదాం అనుకున్నా కానీ ఏదో ఒక పని వలన దానిని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒళ్ళు నొప్పులని లేకపోతే బాగా అలసిపోతున్నామని జిమ్ కి వెళ్లడం మానేస్తారు. కొంతమంది బద్దకంతో మానేస్తారు. మొదట్లో ఉన్న ఆసక్తి కొన్ని రోజులకి తగ్గిపోతుంది చాలా మందికి. విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ జిమ్ కి వెళ్లడం ప్రారంభించాలి అంతేకాని పూర్తిగా మానేయకూడదు.

జిమ్ కి వెళ్ళేటపుడు ఒక్కరమే వెళ్లకుండా ఫ్రెండ్స్, సన్నిహితులతో కలిసి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం జిమ్ కి వెళ్లకపోయినా మన ఫ్రెండ్స్, సన్నిహితులు మనల్ని జిమ్ కి రమ్మని పిలుస్తారు. ఇంకా వాళ్ళతో పాటుగా వెళ్లడం వలన ఇది కూడా ఒక హాబీలా మారిపోయి జిమ్ కి వెళ్లడం మానరు. అదేవిధంగా మీరు పెట్స్ ని పెంచుకుంటే వాటితో పాటు వాకింగ్ కి కూడా వెళ్లడం వలన శరీరానికి వ్యాయామం అనేది అలవాటుగా మారి జిమ్ కి కూడా వెళతారు.

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా??

మనం ముఖ్యంగా ఒక లక్ష్యాన్ని కాగితంపై రాసుకోవాలి. మనం బరువు తగ్గడానికి జిమ్ కి వెళుతున్నామా, పొట్ట తగ్గడానికా, సిక్స్ ప్యాక్ కోసమా లేదా శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికా అన్న విషయం గుర్తుంచుకోవాలి. దానిని బట్టి మనం ఎప్పటికప్పుడు ఎంత వరకు జిమ్ ఫాలో అవుతున్నారు అనేది చెక్ చేసుకుంటూ మన గమ్యాన్ని రీచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇలా చేయడం వలన మనకు జిమ్ కి వెళ్లడం మానాలి అని అనిపించదు. కొంతమంది ఉదయం లేవాలా అనే బద్దకంతో వెళ్ళరు. అలాంటి వాళ్ళు సాయంత్రం పూట మన వర్క్ అయిపోయాక పెట్టుకుంటే రోజు మానకుండా వెళ్తారు.