Night Time Food : రాత్రి పూట డిన్నర్ లేటుగా తింటున్నారా..? అయితే మీ పద్ధతి మార్చుకోవాలి..

Kaburulu

Kaburulu Desk

November 28, 2022 | 01:16 PM

Night Time Food : రాత్రి పూట డిన్నర్ లేటుగా తింటున్నారా..? అయితే మీ పద్ధతి మార్చుకోవాలి..

Night Time Food :  ప్రస్తుతం చాలా మంది రోజూ డిన్నర్ లేటుగానే తింటున్నారు. కానీ ఇలా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి పూట భోజనం లేటుగా తింటే నిద్రపోవడానికి కూడా లేటు అవుతుంది. కాబట్టి రాత్రి పూట భోజనానికి నిద్రకు రెండు గంటల సమయం ఉండాలి. ఇక కొంతమంది అన్నాన్ని టీవీ చూసుకుంటూ లేదా ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు.

రాత్రి పూట లేటుగా అన్నం తినడం వలన అన్నం సరిగా జీర్ణం కాదు మరియు బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది. లేటుగా రాత్రి పూట తింటే అధిక బరువు కూడా పెరుగుతారు. రోజూ రాత్రి పూట లేటుగా తింటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మరియు జ్ఞాపకశక్తి కూడా తగ్గే ప్రభావం ఉంది. డయాబెటిస్ ఉన్న వారు ఖచ్చితంగా భోజనాన్ని లేటుగా తినకూడదు.

Drinks in Winter : చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఈ డ్రింక్స్ తాగండి..

అన్నం తినడానికి రోజూ ఒక టైం మెయింటైన్ చేస్తే మంచిది అది కూడా మనం నిద్రపోవడానికి గంట ముందు ఉండేలా చేసుకోవాలి. రాత్రి పూట లేటుగా తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి..