Morning Tea : మీకు ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉందా??

Kaburulu

Kaburulu Desk

December 22, 2022 | 09:00 AM

Morning Tea : మీకు ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉందా??

Morning Tea :  ఉదయాన్నే టీ త్రాగటం అనేది మనలో చాలా మందికి ఒక అలవాటు. చాలా మంది ఒక కప్పు వేడి వేడి టీతోనే తమ రోజుని ప్రారంభించటానికి ఇష్టపడతారు. వారు ఒక కప్పు టీ తాగకుండా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేరు. ఒక రకంగా చెప్పాలంటే టీలో యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరియు జీవన క్రియను పెంచడానికి సహాయపడతాయి.

అయితే వీటిలో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ త్రాగితే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ కాఫీ లేక టీ ఎక్కువ మార్గాలలో మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో టీ త్రాగటం వల్ల కడుపులోని ఆమ్లాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది సహజ జీవన క్రియ వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. దీంతో జీర్ణాశయానికి కూడా ఇబ్బందులు తప్పవు.

Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి..

అంతేకాక ఉదయాన్నే టీ త్రాగటం వల్ల దంతాలపై ఎనామిల్ దెబ్బతింటుంది. నోటిలోని ఆమ్లా పదార్థాల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇది చివరికి మీ దంతాలలో పంటి కోతకు కారణమవుతుంది. అలాగే ఉదయాన్నే టీ త్రాగటం వల్ల డీ హైడ్రేషన్ కి గురవుతాము. ఒకవేళ ఉదయం ఎవరన్నా టీ తాగాలి అనుకుంటే టిఫిన్ తిన్న తర్వాతే తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.