Traditional Food : ఆంధ్ర, తెలంగాణ సంక్రాంతి పిండివంటలు ఇవే..

సంక్రాంతి అనగానే పండగ వాతావరణం చాలా బాగుంటుంది. తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, ముగ్గులు అన్ని ఇష్టమైనవే అందరికీ. అంతకంటే ఇంకా ఇష్టమైనవి మన అందరికీ నచ్చేవి పిండి వంటలు.........

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 09:00 PM

Traditional Food : ఆంధ్ర, తెలంగాణ సంక్రాంతి పిండివంటలు ఇవే..

Traditional Food :  సంక్రాంతి అనగానే పండగ వాతావరణం చాలా బాగుంటుంది. తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, ముగ్గులు అన్ని ఇష్టమైనవే అందరికీ. అంతకంటే ఇంకా ఇష్టమైనవి మన అందరికీ నచ్చేవి పిండి వంటలు. అందరం పల్లెటూళ్ళకి, చుట్టాలైనాటికి వెళ్లి అక్కడ అనేక రకాల పిండి వంటలు చేసుకొని మరీ అందరితో కలిసి తింటాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంక్రాంతికి రకరకాల పిండి వంటలు వండుతారు. అవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ రాగానే మనకు నోరూరే విధంగా బొబ్బట్లు, బెల్లం గవ్వలు, సున్నుండలు, గారెలు, జంతికలు వండుకుంటారు. ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచివి. ఈ పిండి వంటకాలు అన్ని కూడా బెల్లంతోనే తయారుచేస్తారు. ఇక పండుగరోజు పరవాన్నం కూడా వండుతారు. బెల్లం ఈ కాలంలో తినడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది.

Headache : తలనొప్పి తొందరగా తగ్గడానికి అద్భుతమైన చిట్కా..

తెలంగాణలో సంక్రాంతి పండగ అనగానే చేసుకునే పిండి వంటలు ముఖ్యంగా సకినాలు, బూరెలు, చేకోడీలు, అరిసెలు, కజ్జికాయలు, కారప్పూస వంటివి చేసుకుంటారు. సకినాలు, అరిసెలు వండేటప్పుడు వాటిలో నువ్వులు వేస్తారు. ఈ కాలంలో అవి తినడం వలన మన శరీరానికి వేడి అందుతుంది. అరిసెలు, బూరెలు వండేటప్పుడు వాటిలో బెల్లం వేసి వండుతారు. ఇలా మన పిండి వంటల్లో ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. అలాగే అవి అందరూ ఇష్టంగా తింటారు.