Renu Desai : రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటుందా..? ఆ పోస్ట్ అర్ధం ఏంటి..?

Kaburulu

Kaburulu Desk

September 6, 2022 | 01:38 PM

Renu Desai : రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటుందా..? ఆ పోస్ట్ అర్ధం ఏంటి..?

Renu Desai :  హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరమైనా పవన్ భార్యగా బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నేళ్లు కాపురం చేసిన వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు. రేణుతో విడిపోయిన తర్వాత పవన్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు మాత్రం తన పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోలేదు. పవన్ రేణుకి దూరమైనా పిల్లలని కలుస్తూ ఉంటాడు. వారికోసం అన్ని సమకూరుస్తాడు.

గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుందని, చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో పవన్ అభిమానులు రేణు దేశాయ్ ని ట్రోల్ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇన్నాళ్లు సినిమాలకి దూరమైన రేణు దేశాయ్ ఇటీవల కాలంలో యాడ్స్, టీవీ షోలు, సినిమాలు ఒప్పుకుంటూ మళ్ళీ బిజీ అవుతుంది.

అయితే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రీల్స్ వైరల్ గా మారాయి. ఇందుకు కారణం అందులో ఉన్న సారాంశం. రేణు దేశాయ్ ఒక పోస్ట్ లో.. జీవితంలో మనకి అవసరమైనప్పుడు మన చేయి పట్టుకొని నడిపించే ఒక తోడు కావాలి అని పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో..మీ సోల్‌మెట్ ని కలవాలంటే ముందు మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోవాలి అని పోస్ట్ చేసింది. దీంతో రేణు దేశాయ్ లైఫ్ లో ఒక తోడు కోసం చూస్తుందా? మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా అని అంటున్నారు నెటిజన్లు. మరి దీనిపై రేణు దేశాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.