Waltair Veerayya : టైటిల్ సాంగ్‌కి డేట్ ఫిక్స్ చేసిన వాల్తేరు వీరయ్య..

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మెగస్టార్ కి జోడిగా శ్రుతిహాసన్ నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెస్ట్ అపిరెన్స్ ఇవ్వనున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య..
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’ పాటలు సూపర్ హిట్టుగా నిలిచాయి. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కి డేట్ ఫిక్స్ చేశాడు చిరంజీవి. డిసెంబర్ 26న ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ని చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోని స్టిల్‌తో డిజైన్ చేశారు. అయితే సాంగ్ రిలీజ్ డేట్ చెప్పారు గాని, కచ్చితమైన సమయాన్ని తెలియజేయలేదు.
ఇది ఇలా ఉంటే మెగా ఫ్యాన్స్.. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ విషయంలో హర్ట్ అయ్యారు. ఇదే సినిమాతో బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కూడా విడుదలవుతున్న సంగతి తెలిసింది. ఆ సినిమా సాంగ్ అండ్ టైటిల్ రిలీజ్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తుంటే, వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు. ఈ క్రమంలోనే నేడు మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ లో సమావేశమయ్యి.. చిత్ర యూనిట్ కి ఈ విషయాన్ని తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Get ready to witness Mass Moolavirat’s Vishwaroopam 😎🔥
3rd single #VeerayyaTitleSong from #WaltairVeerayya out on 26th Dec 🔥💣#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/HDxnqHJpyk— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2022