Waltair Veerayya : రేపు రానున్న ‘చిరంజీవి-శ్రీదేవి’..

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 07:48 PM

Waltair Veerayya : రేపు రానున్న ‘చిరంజీవి-శ్రీదేవి’..

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ‘వాల్తేరు వీరయ్య’. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగస్టార్ కి జోడిగా శ్రుతిహాసన్ నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సూపర్ హిట్టుగా నిలిచింది. తాజాగా ఈ చిత్రంలో రెండో పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

Pawan Kalyan ‘The Real Yogi’..

‘‘నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవంటా’’ అంటూ సాగే ఈ పాటలోని బిట్ ని ఇటీవల చిరంజీవి లీక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పాటని సోమవారం సాయంత్రం గం.4:05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. జూలియట్-రోమియో, లైలా-మజ్ను, చిరంజీవి-శ్రీదేవి అంటూ చెబుతూ ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాట చిత్రీకరణ ఫ్రాన్స్ లో మంచు వర్షంలో చిత్రకరించారు.

పాట విజువల్స్ చాలా బాగా వచ్చాయి అంటున్నాడు చిరంజీవి. మరి రేపు విడుదల కానున్న ఈ మెలోడీ చిరంజీవి-శ్రీదేవి జంటలా ఆకట్టుకుంటుందేమో చూడాలి. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో గెస్ట్ అపిరెన్స్ ఇవ్వనున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.