Waltair Veerayya : హిందీ రిలీజ్‌కి కూడా సై అంటున్న వీరయ్య..

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 05:05 PM

Waltair Veerayya : హిందీ రిలీజ్‌కి కూడా సై అంటున్న వీరయ్య..

Waltair Veerayya : మాస్ మూలవిరాట్‌గా చిరంజీవి దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్‌తో రాబోతుంది. ముఠామేస్త్రి తరువాత మళ్ళీ చిరంజీవి ఆ వింటేజ్ లుక్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి.

Nagababu : చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ నాకు నమ్మకం లేదు.. నాగబాబు!

సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ వెర్షన్‌లో కూడా విడుదల కాబోతుంది అని తెలుస్తుంది. ఒకే రోజు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ మూవీని సిద్ధం చేస్తున్నారు అంటా. ఇటీవల గాడ్‌ఫాదర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు అందుకున్న చిరంజీవి.. ఈ సమయంలో వాల్తేరు వీరయ్యని కూడా విడుదల చేస్తే సక్సెస్ అందుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ని నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చాడు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట అందరికి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజ్ రవితేజ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.