Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగేది..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కొత్త జిఓ వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వస్తుందా? లేదా? అని అభిమానుల్లో సందేహం మొదలయింది.

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 06:00 PM

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగేది..

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. దర్శకుడు బాబీ ఈ సినిమాతో మళ్ళీ వింటేజ్ చిరుని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లుక్స్ మాత్రమే కాకుండా సినిమా టైటిల్ కార్డులో మెగాస్టార్ అనే ట్యాగ్ ని కూడా వింటేజ్ వెర్షన్ ని యూజ్ చేస్తున్నాడట బాబీ. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Ram Charan : అన్‌స్టాపబుల్‌కి రామ్‌చరణ్, కేటీఆర్ రాబోతున్నారా?

కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కొత్త జిఓ వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వస్తుందా? లేదా? అని అభిమానుల్లో సందేహం మొదలయింది. దీంతో చిత్ర యూనిట్ నేడు దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోనే నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ముందు అనుకున్నట్లు ఆర్‌కే బీచ్ లో కాకుండా వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి ఈ ఈవెంట్ ని మార్చారు. జనవరి 8న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. కాగా ఈ మూవీ థియేటరికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 7న ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ కచ్చితమైన సమయాన్ని మాత్రం చెప్పలేదు.