Chiru – Balayya : కొత్త సాంగ్ అప్డేట్స్ ఇచ్చిన చిరు, బాలయ్య..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఇద్దరు హీరోలు వింటేజ్ లుక్స్ లో దర్శనమిస్తుండడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. దీంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 06:19 PM

Chiru – Balayya : కొత్త సాంగ్ అప్డేట్స్ ఇచ్చిన చిరు, బాలయ్య..

Chiru – Balayya : మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’. బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఇద్దరు హీరోలు వింటేజ్ లుక్స్ లో దర్శనమిస్తుండడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. దీంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Sai Pallavi : సినిమాలకి దూరంగా సాయి పల్లవి.. సడెన్ గా పుట్టపర్తిలో ప్రత్యక్షం..

ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి నుంచి నాలుగో సాంగ్ అప్డేట్ ని ఇచ్చాడు బాలకృష్ణ. ‘మాస్ మొగుడు’ అంటూ సాగే ఈ పాటకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మాస్ బీట్ లో బాలయ్యతో పాటు శృతిహాసన్ చిందేయనుంది. జనవరి 3న రాత్రి గం.7:55 నిమిషాలకు ఈ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. మరి ఈ మాస్ మొగుడు ఎటువంటి మోత చేయబోతున్నాడో చూడాలి.

అలాగే వాల్తేరు వీరయ్య నుంచి 5వ సాంగ్ ని లీక్ చేశాడు చిరంజీవి. ఈ పాటకి సంబంధించిన మేకింగ్ వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి.. చివరిలో సాంగ్ లిరిక్స్ ని లీక్ చేశాడు. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ సాగే ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ, ఆలపించాడు. శృతిహాసన్, చిరు లతో అందమైన డాన్స్ స్టెప్పులు వేయిస్తున్నాడు శేఖర్ మాస్టర్. త్వరలోనే ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్స్ కి సంబంధించిన పోస్టర్ అండ్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.