Veera Simha Reddy : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటున్న బాలయ్య..

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 04:34 PM

Veera Simha Reddy : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటున్న బాలయ్య..

Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే బాలయ్య లుక్ నుంచి మూవీ టైటిల్, టీజర్ అండ్ సాంగ్స్ అన్ని ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

ఇక ఈ చిత్రంలోని రెండు సాంగ్స్ ని రిలీజ్ చేసిన మూవీ టీమ్, నేడు మూడో పాటని విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మూవీలోని ఐటమ్ నెంబర్ ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ సాంగ్ ని విడుదల చేశారు. క్యాచీ లిరిక్స్ తో పాట అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఈ ఐటమ్ నెంబర్ లో బాలయ్య ఇద్దరి భామలతో కలిసి చిందేసాడు. ముఖ్యంగా సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న మలయాళ బ్యూటీ ‘హనీ రోజ్’తో బాలయ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంది. కాగా థమన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సమకూర్చాడు. శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.