Veera Simha Reddy : వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ కూడా అప్పుడేనా?

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఈవెంట్ ని ఒంగోలులోని AMB కాలేజీ గ్రౌండ్స్‌లో...

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 09:15 PM

Veera Simha Reddy : వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ కూడా అప్పుడేనా?

Veera Simha Reddy : మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం ‘వీరసింహారెడ్డి’. సినిమా టైటిల్ దగ్గర నుండి బాలయ్య లుక్స్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. బాలయ్య కూడా వింటేజ్ లుక్స్ తో కనిపిస్తుండడంతో.. అభిమానులు ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం.

Balakrishna : చలపతి రావుకి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ..

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఈవెంట్ ని ఒంగోలులోని AMB కాలేజీ గ్రౌండ్స్‌లో జనవరి 6న సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లోనే మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మరి అప్పుడే విడుదల చేస్తారా? లేక ముందుగానే రిలీజ్ చేస్తారా? అనేది చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా ఈ సినిమా ట్రైలర్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చూశాడట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా.. ‘వీరసింహారెడ్డి ట్రైలర్ అదిరిపోయింది. యూట్యూబ్ రచ్చరచ్చే’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు మరెంత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అవుతుంది.

veera simha reddy

veera simha reddy