Veera Simha Reddy : వీరసింహారెడ్డి ఊచకోత.. మొదటి రోజే అన్ని కలెక్షన్స్?

నందమూరి నటసింహ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. బాలయ్య నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. చిత్ర నిర్మాతలు ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని అధికారికంగా నేడు ప్రకటించారు.

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 05:40 PM

Veera Simha Reddy : వీరసింహారెడ్డి ఊచకోత.. మొదటి రోజే అన్ని కలెక్షన్స్?

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. బాలయ్య నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు చివరి చిత్రం ‘క్రాక్’ భారీ విజయం అందుకోవడం, బాలయ్య అఖండ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో వీరసింహారెడ్డిపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

Veerasimha Reddy Review : యాక్షన్ ఎలివేషన్స్‌తో పాటు సెంటిమెంట్‌ని పండించిన వీరసింహారెడ్డి.. స్క్రీన్‌పై బాలయ్య ఊచకోత..

దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. చిత్ర నిర్మాతలు ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని అధికారికంగా నేడు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ.54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దాదాపు రూ.28 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. కాగా బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా వీరసింహారెడ్డి నిలిచింది. సుమారు రూ.110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇదే రేంజ్ లో కలెక్షన్స్ రాబడితే మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో కలెక్షన్స్ మరెంత పెరిగే ఛాన్స్ ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మరో కథానాయకిగా మలయాళ బ్యూటీ హనీ రోజ్ నటించింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తమ నటనతో ఆడియన్స్ ని కట్టిపడేశారు. ఎస్ ఎస్ థమన్ తన సంగీతం సినిమాకి ప్రాణం పోశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.