Veera Simha Reddy : తన రికార్డుని తానే బద్దలుకొట్టిన బాలయ్య.. వీరసింహారెడ్డి వీర విహారం..

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేసింది. దీంతో ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన అఖండ లైఫ్ టైం కలెక్షన్స్ ని అలవోకగా దాటేసింది.

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 08:13 PM

Veera Simha Reddy : తన రికార్డుని తానే బద్దలుకొట్టిన బాలయ్య.. వీరసింహారెడ్డి వీర విహారం..

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేసింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగా అలరించింది. మలినేని గోపీచంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడి మునపటి చిత్రం ‘క్రాక్’ సూపర్ హిట్టు కావడం, బాలకృష్ణ మునపటి సినిమా ‘అఖండ’ అఖండమైన విజయం కావడంతో.. వీరసింహారెడ్డి పై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి ఊచకోత.. మొదటి రోజే అన్ని కలెక్షన్స్?

వాటికి తగ్గట్టు బాలయ్య నుంచి చాలా కాలం తరువాత ఫ్యాక్షన్ నేపథ్యంతో మూవీ వస్తుండడంతో అభిమానులు సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిని చూపించారు. దీంతో ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ ని చూసింది. బాలకృష్ణ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయి. అంతే కాదు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఏమా దూకుడు చూపించింది. కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.104 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.

తాజాగా ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన అఖండ లైఫ్ టైం కలెక్షన్స్ ని అలవోకగా దాటేసింది. కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా సుమారు రూ.70 కోట్ల షేర్ రాబట్టి అఖండ లైఫ్‌టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసింది. కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.4 కోట్ల దూరంలో ఉంది. మరో వారం వరకు ఎటువంటి సినిమా రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అంటున్నారు సినీ ఎక్స్‌‌పర్ట్స్.

ఫ్యాక్షన్ స్టోరీకి సిస్టర్ సెంటిమెంట్ ని జత చేయడంలో దర్శకుడు మలినేని బాగా సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా అలరించింది. అందువల్లే వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు. ఇక అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుసగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టులు అందుకోవడంతో బాలయ్య తదుపరి సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడితో తన తరువాతి సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.