Dil Raju : ‘వారిసు’ సినిమా మహర్షికి రీమేక్.. స్పందించిన దిల్ రాజు!

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 05:05 PM

Dil Raju : ‘వారిసు’ సినిమా మహర్షికి రీమేక్.. స్పందించిన దిల్ రాజు!

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘వారిసు’. ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదలవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది.

Vijay : స్టేజీపై ‘రంజితమే’ పాట పాడి అదరగొట్టిన విజయ్..

ఇక ఈ ఈవెంట్ లో వారిసు సినిమా మహేష్ బాబు ‘మహర్షి’కి రీమేక్, సీక్వెల్ అంటూ వస్తున్న వార్తలపై దిల్ రాజు వివరణ ఇచ్చాడు. ‘వారిసు సినిమా ఏ చిత్రానికి రీమేక్ లేదా సీక్వెల్ కాదు, ఇది పక్కా తమిళ సినిమా. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే సాంగ్స్ అండ్ డాన్సులు మీరు ఈ సంక్రాంతికి చూడబోతున్నారు. ఈ చిత్రాన్ని మేము అందరి తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాము’ అంటూ వెల్లడించాడు.

కాగా ఇదే స్టేజీపై హీరో విజయ్ ‘రంజితమే’ సాంగ్ పాడి, డాన్స్ వేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. రాధికా శరత్ కుమారు, జయసుధ, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్.