Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ నుంచి గోపీచంద్ ప్రోమో రిలీజ్..

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 07:43 PM

Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ నుంచి గోపీచంద్ ప్రోమో రిలీజ్..

Unstoppable2 : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో.. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ షోకి ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరయ్యాడు.

Yash : పాన్ ఇండియా స్టార్ ‘యష్’తో భేటీ అయిన నారా లోకేష్‌.. అందుకోసమేనా?

తాజాగా గోపీచంద్ కి సంబంధించిన వీడియో ప్రోమోని రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ఈ ప్రోమోలో గోపీచంద్, ప్రభాస్ సీక్రెట్స్ అన్ని బయటపెడుతుంటే.. ప్రభాస్ ‘ఒరేయ్’ అంటూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ పై దాడి చేస్తుంటే బాలయ్య అడ్డు పడడం ప్రేక్షకుల్లో ఈ ఎపిసోడ్ పై మరెంత హైప్ పెరిగేలా చేస్తుంది.

ఇక ప్రోమో లాస్ట్ లో బాలయ్య.. ‘అది ఒంగోలియన్స్ అంటే’ అంటూ చెప్పిన డైలాగ్ కిక్ ఇచ్చేలా ఉంది. ఇక ఈ కొత్త ప్రోమోతో ఈ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూదామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కాగా ఇదే షోలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫోన్ కాల్ ద్వారా భాగం కానున్నాడట. ఆ ఫోన్ కాల్ లో చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి లీక్ చేయనున్నట్లు తెలుస్తుంది.