Unstoppable 2 : అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబుతో బాలయ్యబాబు చర్చించిన అంశాలు ఇవే..

Kaburulu

Kaburulu Desk

October 14, 2022 | 04:25 PM

Unstoppable 2 : అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబుతో బాలయ్యబాబు చర్చించిన అంశాలు ఇవే..

Unstoppable 2 : బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ షోకి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఈ షోకి సీజన్ 2 కూడా ప్రకటించారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ షో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ నేడు ఆహాలో రిలీజ్ అయింది. అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇందులో పర్సనల్, ఫ్యామిలీ, పాలిటిక్స్ అంశాలు అన్ని చర్చించడంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో చర్చించిన రాజకీయాంశాలు అయితే ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి.

అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబుతో బాలయ్యబాబు చర్చించిన అంశాలు ఇవే..

*షోలో మొదటగా బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్టెప్పులతో అదరగొట్టారు బాలయ్య. ఆ తర్వాత చంద్రబాబుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

*చంద్రబాబు ఎన్టీఆర్ ని మొదటిసారి ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారో మాట్లాడారు.

*చంద్రబాబు చేసిన హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చించారు.

*ఇటీవల జగన్ ప్రభుత్వం విజయవాడలో ఉన్నా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని రాజశేఖర్ రెడ్డి పేరుతో మార్చిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద వివాదంగా మారింది. తాజాగా ఈ షోలో మరోసారి దీనిపై బాలకృష్ణ, చంద్రబాబు స్పందించారు.

*ఇక హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ ని, బిల్ గేట్స్ ని చంద్రబాబు ఎలా తీసుకొచ్చారో చెప్పారు.

*బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్, ఆసుపత్రిని, భువనేశ్వరి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్ ని బాగా నడిపిస్తున్నారంటూ చంద్రబాబు అభినందించారు.

*వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న స్నేహం గురించి తెలిపారు చంద్రబాబు.

*చంద్రబాబు కాలేజీలో చేసిన అల్లరి పనులు గుర్తుచేసుకున్నారు.

*చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో చెప్పారు.

*దేశ రాజకీయాల గురించి కూడా చంద్రబాబు ఈ షోలో ప్రస్తావించారు.

*వివాదాస్పద అంశం అయిన ఎన్టీఆర్ ఇష్యూ గురించి చంద్రబాబు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఎపిసోడ్ లో మాట్లాడారు.

*కోడలు బ్రాహ్మణి, తన భార్య భువనేశ్వరి గురించి గొప్పగా చెప్పారు చంద్రబాబు.

*లోకేష్, బ్రాహ్మణి వివాహం గురించి మాట్లాడారు.

*లోకేష్ పై వచ్చే ట్రోల్స్ గురించి స్పందించారు.

*చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి కూడా చర్చించారు.

*లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినా విషయాన్ని కూడా ప్రస్తావించారు ఈ షోలో.

*చివరగా చంద్రబాబు దేశ ప్రజలకి, యూత్ కి మెసేజ్ ఇచ్చారు.

Allu Arjun : కేంద్రమంత్రి చేతుల మీదుగా ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

ఈ షోలో ఎక్కువగా పాలిటిక్స్ మాట్లాడటంతో రాజకీయాల్లో చర్చగా మారింది ఎపిసోడ్. ఇప్పటికే పలువురు ప్రత్యర్ధ పార్టీ నాయకులు ఈ షోపై స్పందిస్తున్నారు.