SSMB28 : SSMB28 మూవీ షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం SSMB28. అయితే ఈ సినిమా రెండు షెడ్యూల్ మూవీ టీం ఇంకా మొదలు పెట్టకపోవడంతో.. SSMB28 పై అనేక రుమౌర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ నిర్మాత నాగవంశీ చెక్ పెట్టాడు.

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 09:57 AM

SSMB28 : SSMB28 మూవీ షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం SSMB28. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి ప్రజాధారణ పొందడంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. గ్రాండ్ గా షూటింగ్ మొదలు పెట్టుకున్న చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. అయితే రెండు షెడ్యూల్ మూవీ టీం ఇంకా మొదలు పెట్టకపోవడంతో.. SSMB28 పై అనేక రుమౌర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ నిర్మాత నాగవంశీ చెక్ పెట్టాడు.

SSMB28 నుంచి ఆ హీరోయిన్ తప్పుకుందా?

నాగవంశీ నిర్మిస్తున్న ‘బుట్టబొమ్మ’ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ, హీరోయిన్ అనిఖా సురేంద్రన్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో SSMB28 గురించి ప్రశ్నించగా.. ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. ‘ఇటీవల కాలంలో ఈ సినిమా నుంచి హీరోయిన్ శ్రీలీల తప్పుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మూవీ నుంచి తప్పుకోలేదు. అలాగే ఆమె సెకండ్ హీరోయిన్ అంటూ అందరు అంటున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్దే, శ్రీలీల ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. మహేష్ బాబు పక్కన ఇద్దరు ఈక్వల్ రోల్స్ చేస్తున్నారు. మేము ఎవరికి ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అని ట్యాగ్ ఇవ్వలేదు’ అంటూ వెల్లడించాడు.

అలాగే ఈ సినిమా రిలీజ్ అండ్ షూటింగ్ డేట్స్ అప్డేట్ కూడా ఇచ్చాడు. ఈ నెల 18 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అని తెలియజేశాడు. ఈ ఏడాదిలోనే ఆగష్టు 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు కూడా వెల్లడించాడు. టైటిల్ ఇంకా ఏమి అనుకోలేదు. ఫైనల్ అవ్వగానే అనౌన్స్ చేస్తాము అంటూ తెలియజేశాడు. ఇక వార్త విన్న మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.