SSMB28 : SSMB28 షూటింగ్ సెట్ లీక్.. మెట్రో నుంచి వీడియో రికార్డింగ్..
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది.

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టిన మూవీ టీం సెకండ్ షెడ్యూల్ ని మాత్రం ఎటువంటి హంగామా లేకుండా ప్రారంభించారు. హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మూవీ నుంచి ఎలాంటి వీడియో, ఫోటోలు లీక్ అవ్వకుండా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది.
SSMB28 : SSMB28 మూవీ షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..
ఈ షూటింగ్ లోని పూజా హెగ్డే ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇప్పుడు షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. సారధి స్టూడియోస్ లో జరుగుతున్న ఈ షూటింగ్ కి ఎవర్ని అనుమతించడం లేదు. అయితే ఈ స్టూడియో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పక్కన ఉండడంతో, అభిమానులు మెట్రోలో పయనిస్తూ.. SSMB28 యొక్క సెట్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లీక్ అయిన వీడియోలను చూస్తుంటే.. ఖలేజా సినిమాలో మనం చూసిన పల్లెటూరి సెట్ లా కనిపిస్తుంది.
కాగా ఈ సినిమాని శర వేగంగా షూటింగ్ జరిపి ఈ ఏడాది ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు నిర్మాత నాగవంశీ ఇటీవల తెలియజేశాడు. ఈ సినిమాలో శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. పూజా హెగ్దేతో సమానంగా శ్రీలీల పాత్ర కూడా ఉండనున్నట్లు నాగవంశీ తెలియజేశాడు. సంయుక్త మీనన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
#SSMB28 1st Shedule Set 🔥🔥#MaheshBabu @urstrulyMahesh pic.twitter.com/HQ4OjMyEUg
— SSMB_BEATZ™ (@ssmb_Beatz) January 19, 2023