Ram Charan : రామ్‌చరణ్‌కి ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆస్కార్ గెలిచాక..

మెగాపవర్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తన నటన విశ్వరూపం చూపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు చరణ్ ని పొగుడుతున్నారు. అంతేకాదు చరణ్ కి వచ్చిన ఇమేజ్ ని బాలీవుడ్ హీరోలు సైతం ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్..

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 07:03 PM

Ram Charan : రామ్‌చరణ్‌కి ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆస్కార్ గెలిచాక..

Ram Charan : మెగాపవర్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు చరణ్ ని పొగుడుతున్నారు. అంతేకాదు చరణ్ కి వచ్చిన ఇమేజ్ ని బాలీవుడ్ హీరోలు సైతం ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన ‘పఠాన్’ కోసం రామ్ చరణ్ సహాయం తీసుకున్నాడు. పఠాన్ థియేట్రికల్ ట్రైలర్ ని ఇవాళ రిలీజ్ చేశారు.

Ram Charan : అన్‌స్టాపబుల్‌కి రామ్‌చరణ్, కేటీఆర్ రాబోతున్నారా?

ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ చేత విడుదల చేయించాడు షారుఖ్ ఖాన్. చరణ్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. అయినా సరే షారుఖ్ ఖాన్ కోసం సమయం తీసుకోని మరీ, అక్కడి నుంచే ట్రైలర్ ని లాంచ్ చేశాడు చరణ్. దీంతో షారుఖ్ ట్విట్టర్ ద్వారా.. థాంక్యూ మై మెగాపవర్ స్టార్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు.

‘మీ ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ గెలుచుకొని ఇంటికి తీసుకు వచ్చిన తరువాత, నన్ను ఒకసారి దానిని టచ్ చేయనివ్వండి’ అంటూ తెలుగులో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా RRR ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో ‘నాటు నాటు’ సాంగ్ తో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో స్థానం దక్కించుకుంది. దీంతో మూవీ టీం ఓటర్స్ కోసం చైనీస్ థియేటర్ లో నిర్వహించే స్క్రీనింగ్ కి హాజరయ్యింది.

ఇక ఈ మూవీ చూసిన ఓటర్స్.. ఈ సినిమా బెస్ట్ మూవీ క్యాటగిరీకి కూడా ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిలో హాలీవుడ్ నిర్మాతలు కూడా ఉండడం విశేషం. దీంతో ఈ మూవీ ఉత్తమ చిత్రం నామినేషన్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయి అంటున్నాయి హాలీవుడ్ మీడియా. మరి చూడాలి ఏమి జరుగుతుందో అనేది.