Samantha : యశోద ట్రైలర్ రిలీజ్.. సరోగసి మాఫియాపై సమంత పోరాటం..

Kaburulu

Kaburulu Desk

October 28, 2022 | 08:50 AM

Samantha : యశోద ట్రైలర్ రిలీజ్.. సరోగసి మాఫియాపై సమంత పోరాటం..

Samantha :  సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టులోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని నవంబర్ 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చాలా రోజుల తర్వాత సమంత సినిమా రాబోతుంది. సమంత ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓ టీజర్ ని వదిలి సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్ర యూనిట్.

తాజాగా యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో ఒక్కో స్టార్ హీరోతో ట్రైలర్ ని రిలీజ్ చేయించారు. తెలుగులో విజయ్ దేవరకొండ యశోద ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

RGV : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ కొత్త సినిమాలు.. జగన్ ని కలిసిన కాసేపటికే ప్రకటన..

యశోద ట్రైలర్ లో.. డబ్బుల కోసం సమంత సరోగసికి ఒప్పుకొని వేరే వాళ్ళ బిడ్డని కడుపులో మోస్తుంది. తన లాగే చాలా మంది అమ్మాయిలు ఒక సరోగసి సెంటర్ లో ఉంటారు. అయితే అక్కడ సరోగసి మాత్రమే కాక ఇంకా ఏదో జరుగుతుందని తెలుసుకొని ఆ సరోగసి హాస్పిటల్ తో పోరాటానికి దిగుతుంది సమంత. మరి సమంత దేనికోసం, ఎవరికోసం పోరాటం చేసింది అనేది మాత్రం తెరపై చూడాల్సిందే. ప్రెగ్నెంట్ లేడీగా సమంత బాగా యాక్ట్ చేసినట్టు ట్రైలర్లోనే అర్ధమవుతుంది. ఇక సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఉండటంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ సినిమాతో వస్తున్న సమంతకి యశోద ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి. సామ్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.