Samantha : యశోద సినిమాకి సమంత అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందా??

Kaburulu

Kaburulu Desk

September 10, 2022 | 01:33 PM

Samantha : యశోద సినిమాకి సమంత అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందా??

Samantha :  చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ పెంచేసి మనీ కోసమే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. చైతన్యతో విడాకుల తర్వాత పుష్పలో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ ఐటెం సాంగ్ తో అలరించిన సమంత త్వరలో యశోద సినిమాతో పలకరించబోతుంది.

సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమాని యువ దర్శకులు హరి, హరీష్ లు కలిసి తెరకెక్కిస్తుండగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ అని ముందు నుంచే అర్ధమవుతుంది. తాజాగా ఈ యశోద టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో సమంత ప్రెగ్నెన్సీ తో యాక్షన్ సీన్స్ చేస్తుంది. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ గురించి వార్తలు వైరల్ గా మారాయి.

Kiran Abbavaram : నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్..

సాధారణంగా సమంతా గతంలో సినిమాకి ఒక కోటి నుంచి రెండు కోట్ల వరకు తీసుకునేది. ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసింది అని ఆల్రెడీ సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల పుష్ప సినిమాలో ఒక ఐటెం సాంగ్ కి దాదాపు కోటిన్నర వరకు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు యశోద సినిమాకి లేడీ ఓరియెంటెడ్ కావడం, సినిమా అంతా తన చుట్టే తిరుగుతుండటంతో దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఒక సినిమాకి తెలుగు హీరోయిన్ మూడు కోట్లు అంటే ఎక్కువే అంటున్నారు కొంతమంది. కానీ ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం, ఇటీవల సమంతకి ఫ్యామిలీ మ్యాన్ తో నార్త్ లో కూడా మార్కెట్ ఏర్పడటంతో సమంతకి మూడు కోట్లు కూడా తక్కువే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి యశోద సినిమాతో సమంత ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పించి, కలెక్షన్లని రాబడుతుందో చూడాలి.