RRR : క్రిటిక్స్ ఛాయస్ అవార్డు అందుకున్న RRR..

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక ఈ ఆదివారం 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’లో ఎం ఎం కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్.

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 10:59 AM

RRR : క్రిటిక్స్ ఛాయస్ అవార్డు అందుకున్న RRR..

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక ఈ ఆదివారం ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’లో ఎం ఎం కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్.

RRR : మరో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న కీరవాణి..

ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన క్రిటిక్స్ ఛాయస్ అవార్డుల పోటీలో RRR సినిమా పలు కేటగిరీలో పోటీ చేసింది. కాగా ఈ రేస్ లో ఆర్ఆర్ఆర్ రెండు కేటగిరీలో అవార్డుని గెలుచుకుంది. ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డులను గెలుచుకున్న విషయాన్ని RRR టీం తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవడంతో చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు.

కాగా ఈ అవార్డుల వేడుకలకు ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ కూడా హాజరయ్యాడు. అవతార్, టైటానిక్ వంటి సినిమాలు తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్.. RRR ని వీక్షించినట్లు వెల్లడించాడు. అంతేకాదు తన భార్యని కూడా ఆర్ఆర్ఆర్ చూడమని సజెస్ట్ చేసి, ఆమెతో పాటు రెండో సరి సినిమా చూసినట్లు తెలియజేశాడు. నిన్న అవార్డుల వేడుకల్లో రాజమౌళి, కీరవాణిని కలుసుకున్న జేమ్స్.. ఆర్ఆర్ఆర్ సినిమాని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ప్రశంసిస్తూ మాట్లాడినట్లు RRR టీం తెలియజేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.