RRR : ఆస్కార్‌ నామినేషన్ లిస్ట్ అనౌన్స్.. RRR గ్రాండ్ ఎంట్రీ..

రాజమౌళి కల నెరవేరింది. RRR ని ఆస్కార్ రేస్ లో నిలిపేందుకు గత కొంత కాలంగా అమెరికాలోని పలు నగరాల్లో కాంపెయిన్ చేస్తూ కష్టపడిన రాజమౌళికి ఫలితం దక్కింది. RRR ఆస్కార్ నామినేషన్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 08:01 PM

RRR : ఆస్కార్‌ నామినేషన్ లిస్ట్ అనౌన్స్.. RRR గ్రాండ్ ఎంట్రీ..

RRR : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తూ నేడు ఆస్కార్ వరకు చేరుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా భారతదేశం తరుపు నుంచి అధికారికంగా ఆస్కార్ కి వెళుతుంది అనుకున్నారు అందరూ. కానీ భారత ప్రభుత్వం ‘ది లాస్ట్ ఫిలిం షో’ని ఎంపిక చేసింది. దీంతో RRR ఆస్కార్ కలలు.. కలలు గానే మిగిలిపోతాయి అనుకున్నారు. అయితే మన జక్కన ఊరుకుంటాడా, ఆర్ఆర్ఆర్ ని ఎలాగైనా ఆస్కార్ రేస్ లో నిలిపేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. జనరల్ ఎంట్రీ ద్వారా నామినేషన్ లిస్ట్ లో స్థానం సంపాదించేందుకు గత కొంత కాలంగా అమెరికాలోని పలు నగరాల్లో కాంపెయిన్ చేస్తూ కష్టపడుతున్నాడు.

RRR Movie : RRR ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు.. జపాన్ లోనూ RRR హవా..

ఎట్టకేలకి రాజమౌళి కల నెరవేరింది. RRR ఆస్కార్ నామినేషన్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ ని నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ నామినేషన్స్ లో ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఎంపిక అయ్యింది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న మొదటి ఇండియన్ సాంగ్ గా ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ పాట పలు అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకోవడంతో.. ఆస్కార్ గెలుచుకోవడం పక్కా అంటున్నారు విదేశీలు సైతం. మార్చి 12న అవార్డుల అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ పాటని ఎం ఎం కీరవాణి కంపోజ్ చేశాడు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు.

ఈ పాటలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు ఒకే సింక్ లో స్టెప్పులు వేసి అదరగొట్టేశారు. వీళ్లిద్దరు వేసిన మాస్ స్టెప్పులకు ఫారినర్ లకు కూడా పూనకాలు వచ్చాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అలరించిన ఈ పాట ఆస్కార్ గెలుస్తుందా? లేదా? అనేది తెలియాలి అంటే మర్చి వరకు ఆగాలసిందే. కాగా ఆస్కార్ రేస్ లో RRR తో పాటు మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ‘అల్ ది బ్రీత్స్’ చిత్రాలు ఆస్కార్ కి ఎంపిక అయ్యాయి.