RGV : థియేటర్లో కుర్చీలు తగలపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ఆర్జీవీ ట్వీట్..

RGV : ఇటీవల స్టార్ హీరోల పుట్టిన రోజులకి వారి పాత సినిమాలని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో బిల్లా సినిమాని స్పెషల్ షోలో వేశారు. దీనికి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
అయితే పలు థియేటర్స్ లో అభిమానులు శృతిమించి మరీ రచ్చ చేశారు. ఏలూరులోని ఓ థియేటర్ లో అభిమానులు కుర్చీలు విరగ్గొట్టారు. తాడేపల్లిగూడెం లోని ఓ థియేటర్లో కుర్చీలు తగలపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇలాంటి సంఘటనలు పలు చోట్ల జరిగాయి. వీటిపై ఆయా థియేటర్ యాజమాన్యాలు సీరియస్ అయి పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు.
అయితే పలువురు వీటిని వీడియోలు తీసి ఇది ప్రభాస్ అభిమానుల అభిమానం అంటూ గొప్పగా ప్రమోట్ చేసుకోవడం ఆశ్చర్యం. ఓ నెటిజన్ థియేటర్లో మంటల్లో తగలబడుతున్న కుర్చీలని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఆ వీడియోని ఆర్జీవీ షేర్ చేసి.. ఇది దీపావళి కాదు. ప్రభాస్ అభిమానుల పిచ్చి అభిమానం. ఒక థియేటర్ ని తగలపెట్టే పిచ్చి అభిమానం అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొంతమంది ఈ ట్వీట్ ని పాజిటివ్ గా తీసుకుంటుంటే మరికొంతమంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు.
No it’s not Diwali celebration ..It’s the madness of #Prabhas fans celebrating by burning a theatre while his film is running on the screen pic.twitter.com/lbYje0t356
— Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022