Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న రవితేజ..

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నాడు. తాజాగా రవితేజ, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇక వరుస విజయాలు అందుకున్న రవితేజ..

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 06:22 PM

Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న రవితేజ..

Tiger Nageswara Rao : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నాడు. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇచ్చాడు. ఒకప్పటి రవితేజ మార్క్ కామెడీ అండ్ మాస్ ఈ సినిమాలో కనిపించడంతో రెండు వారంలోనే దాదాపు రూ.100 కోట్ల కొల్లగొట్టి రవితేజని 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేలా చేసింది.

Dhamaka : ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ధమాకా..

తాజాగా రవితేజ, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇక వరుస విజయాలు అందుకున్న రవితేజ.. ఇదే ఆనందంలో తన తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. రేణూ దేశాయ్‌, బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొంది.

ఈ షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్.. ‘టైగర్ హంట్ లోడింగ్’ అంటూ ట్వీట్ చేసింది. అయితే జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావడంతో టైగర్ నాగేశ్వరరావుకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గాని వీడియో గ్లింప్స్ గాని విడుదల చేస్తారు అని ఆశిస్తున్నారు అభిమానులు. అయితే మూవీ టీం నుంచి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీలు గాయత్రి భరద్వాజ్‌, నుపుర్‌ సనన్‌ తెలుగుతెరకు పరిచయం అవుతున్నారు. తమిళ మూసీకి డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.