Dhamaka : కేజీఎఫ్-2 రికార్డుని బ్రేక్ చేయడానికి ఒకరోజు దూరంలో రవితేజ ‘ధమాకా’..

మాస్ రాజా రవితేజ నటించిన మాస్ మసాలా చిత్రం 'ధమాకా'. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా విడుదలయ్యి 12 రోజులు కంప్లీట్ అవుతున్నా కోటి తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రలో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది.

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 09:19 PM

Dhamaka : కేజీఎఫ్-2 రికార్డుని బ్రేక్ చేయడానికి ఒకరోజు దూరంలో రవితేజ ‘ధమాకా’..

Dhamaka : మాస్ రాజా రవితేజ నటించిన మాస్ మసాలా చిత్రం ‘ధమాకా’. రెండు భారీ ప్లాప్‌లు తరువాత రవితేజ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ ధమాకా ఏంటో చూపిస్తుంది. మొదటిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. సెకండ్ డే నుంచి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం మొదలు పెట్టింది. రవితేజ ఎనర్జీకి శ్రీలీల అందం, అల్లరి తోడవడంతో అభిమానులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

Dhamaka Movie Review : అదరగొట్టేసిన రవితేజ, శ్రీలీల.. ధమాకా రివ్యూ..

ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా విడుదలయ్యి 12 రోజులు కంప్లీట్ అవుతున్నా.. కోటి తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రలో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది. 17 రోజులు పాటు కోటికి పైగా కలెక్షన్లు రాబట్టి మొదటిస్థానంలో నిలిచింది RRR, ఆ తరువాత 12 రోజులుగా కేజీఎఫ్-2 నిలవగా.. ఇప్పుడు ఈ సినిమాకి సమానంగా ధమాకా మూడోస్థానంలో నిలిచింది. ఇదే రేంజ్ లో రేపు కూడా కలెక్షన్స్ వస్తే కేజీఎఫ్-2 రికార్డుని బ్రేక్ చేయడం ఖాయం.

కాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడానికి కూడా ఒక అడుగు దూరంలోనే ఉంది. మరి ఈ రెండిటిని ఒకేసారి అందుకోనున్నాడా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం రవితేజ నటించిన మరో సినిమా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కూడా విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రంలో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చిరంజీవిని ఢీ కొట్టబోతున్నట్లు తెలుస్తుంది.