Pawan – Charan : పవన్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పిన చరణ్..

పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఈ షోలో బాలయ్య, పవన్ ని చాలా విషయాలు ప్రశ్నించాడు. అలాగే రామ్ చరణ్ తో పవన్ కి ఉన్న అనుబంధం గురించి ప్రశ్నించాడు.

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 10:38 AM

Pawan – Charan : పవన్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పిన చరణ్..

Pawan – Charan : ప్రముఖ ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ గా నిలవగా, సెకండ్ సీజన్ అంతకు మించి హిట్ గా నిలిచింది. కాగా ఈ సీజన్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పవర్ ఫుల్ గా ఎండింగ్ పలుకుతున్న సంగతి తెలిసిందే. పవన్, బాలయ్య టాక్ షో కి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణకి తెరపడింది.

Pawan – Charan : చరణ్‌ ఎక్కువ మాలలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్?

ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి బాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ లో పవన్ సినిమాలు, ఫ్యామిలీ గురించే ఎక్కువుగా ప్రశ్నించాడు బాలకృష్ణ. మరి సెకండ్ ఎపిసోడ్ లో రాజకీయ విషయాలు చర్చకు రావొచ్చు. కాగా ఈ మొదటి భాగంలో బాలకృష్ణ.. రామ్ చరణ్ తో పవన్ కి ఉన్న అనుబంధం గురించి ప్రశ్నించాడు.

రామ్ చరణ్ నీకు బాగా క్లోజ్ అంటగా అని అడగా.. అవ్వాల్సి వచ్చింది అంటూ పవన్ బదులిచ్చాడు. నా 16 ఏళ్ళ వయసులో వాళ్ళు పుట్టారు. ఇంటిలో ఎవరు ఉండేవారు. ఇక వాళ్ళ డ్యూటీ నాకు వేసేవారు. అలా వాళ్లకి దగ్గరయ్యినట్లు తెలియజేసాడు. ఆ తరువాత చరణ్ కి ఫోన్ చేయమని బాలకృష్ణ కోరగా పవన్ చేసి ఇచ్చాడు. బాలకృష్ణ, చరణ్ తో మాట్లాడుతూ.. మీ బాబాయ్ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పు అని అడిగాడు.

చరణ్ బదులిస్తూ.. అయన లైఫ్ లో ఏ సీక్రెట్స్ ఉండవు అండి. ఫుల్ బోరింగ్ పర్సన్. కాకపోతే హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నెలలో 30 రోజులు అదే తినమన్నా తింటారు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే చిన్నప్పుడు సింగపూర్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కి నరకం చూపించినట్లు చెప్పుకొచ్చాడు. తను సింగపూర్ లో వామిటింగ్స్ చేసుకుంటే అది ఆయనే క్లీన్ చేశాడు అంటూ వివరించాడు.

ఇక ఆ తరువాత బాలయ్య మాట్లాడుతూ.. నువ్వు మీ బాబాయ్ కలిసి మీ నాన్నకి తెలియకుండా చేసిన ఒక పని చెప్పమని అడగగా, చరణ్ బదులిస్తూ.. అలా ఏమి లేదు గాని, మా నాన్నగారు హేండిల్ చేయలేక పోయినప్పుడు బాబాయ్ దగ్గరకి పంపించేవారు. అయన కొట్టే వారు కాదు, కానీ గంటలు పాటు స్పీచ్ ఇచ్చేవాడు, యోగా, ధ్యానం చేయమనేవాడు. నేను అవి కొన్నిరోజులు పాటించేవాడిని మళ్ళీ అంతా మాములే అంటూ చెప్పుకొచ్చాడు.