Ram Charan-Akshay Kumar : ఒకే స్టేజిపై రామ్ చరణ్, అక్షయ్ కుమార్.. ఢిల్లీలో డ్యాన్సులతో రచ్చ చేశారుగా..

Kaburulu

Kaburulu Desk

November 13, 2022 | 09:54 AM

Ram Charan-Akshay Kumar : ఒకే స్టేజిపై రామ్ చరణ్, అక్షయ్ కుమార్.. ఢిల్లీలో డ్యాన్సులతో రచ్చ చేశారుగా..

 

RRR సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. సౌత్ టు నార్త్ అన్ని చోట్ల బాగా పాపులర్ అయిపోయి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాలీవుడ్ లో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు చరణ్. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గెస్ట్ గా రాగా, సౌత్ నుంచి రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్ళాడు.

దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అక్షయ్, చరణ్ ని ఒకే వేదికపై కూర్చోపెట్టి కాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. బాలీవుడ్ సినిమాలు, RRR, ఆచార్య, అక్షయ్ సినిమాల గురించి మాట్లాడారు. సినిమా టికెట్స్, థియేటర్స్ గురించి కూడా మాట్లాడారు. కరోనా, అభిమానులు.. ఇలా పలు అంశాలపై ఇద్దరు హీరోలు మాట్లాడారు.

Deepthi Ganta : నాని నిర్మాణంలో డైరెక్టర్‌గా నాని సోదరి.. మీట్ క్యూట్ అంటూ రాబోతున్న దీప్తి గంటా..

ఇక చివర్లో ఇద్దరూ కలిసి స్టేజి మీద డ్యాన్సులు వేశారు. మొదట తెలుగులో రామ్ చరణ్ రంగస్థలం నుంచి రంగమ్మ మంగమ్మ సాంగ్ కి డ్యాన్స్ వేయగా ఆ తర్వాత హిందీ సాంగ్ కి వేశారు. చరణ్, అక్షయ్ ఇద్దరూ కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేస్తూ రెచ్చిపోయారు. వీళ్ళ డ్యాన్సులు చూసి అక్కడున్న వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక ఈ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్ డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.