Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు..

Kaburulu

Kaburulu Desk

December 3, 2022 | 12:41 PM

Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు..

Rajamouli :  RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయారు రాజమౌళి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఈ సినిమాని, రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు. సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా RRR క్రేజ్ అలాగే ఉంది. రాజమౌళి గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి హాజరవుతూ, సినిమాని ప్రత్యేక ప్రదర్శనలు వేయిస్తూ, అక్కడి ప్రేక్షకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు.

ఇప్పటికే రాజమౌళి అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ లో పలు అవార్డులు అందుకున్నారు. పలు గుర్తింపులు దక్కించుకుంటున్నారు. హాలీవుడ్ వేదికపై అక్కడి ప్రముఖులు రాజమౌళిని పొగిడేస్తున్నారు. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ పేపర్ లో రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. తాజాగా RRR సినిమాకి గాను హాలీవుడ్ లో రాజమౌళికి మరో అవార్డు వరించింది.

Hit 2 Review : హిట్ 2 సినిమా రివ్యూ.. అదిరిపోయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC) హాలీవుడ్ లో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సినిమాలకి ఎప్పట్నుంచో అవార్డులు ఇస్తుంది. ఈ సంవత్సరం అవార్డుని తాజాగా ప్రకటించింది. ఈ అవార్డుల్లో RRR సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు రాజమౌళిని అభినందిస్తున్నారు.