Rajamouli : హృతిక్ రోషన్‌ని అవమానించడం నా ఉద్దేశం కాదు.. రాజమౌళి!

'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. దీంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే రాజమౌళి గురించి ఒక కాంట్రవర్షియల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రెజెంట్ ఈ వీడియో వైరల్ అయ్యి తప్పుగా అర్ధమవుతుండడంతో రాజమౌళి వివరణ ఇచ్చాడు.

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 09:55 AM

Rajamouli : హృతిక్ రోషన్‌ని అవమానించడం నా ఉద్దేశం కాదు.. రాజమౌళి!

Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. పలు ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ లో అవార్డులు అందుకుంటూ ఇండియన్ సినిమాని ప్రపంచదేశాలకు పరిచయం చేస్తున్నాడు. దీంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే రాజమౌళి గురించి ఒక కాంట్రవర్షియల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై సంచలన కామెంట్స్ చేశాడు.

RRR : మరో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న కీరవాణి..

ప్రభాస్ ‘బిల్లా’ మూవీ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ధూమ్-2 సినిమా చూసినప్పుడు మనం ఆ రేంజ్ లో సినిమాలు తీయలేమా? మన దగ్గర హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? అనుకున్నాను. కానీ ఇప్పుడు బిల్లా పోస్టర్స్ అండ్ ట్రైలర్ చూశాక చెబుతున్నా.. హృతిక్ రోషన్ ఎందుకు పని చేయడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రెజెంట్ ఈ వీడియో వైరల్ అయ్యి తప్పుగా అర్ధమవుతుండడంతో రాజమౌళి వివరణ ఇచ్చాడు.

’15 ఏళ్ళ క్రిందటి వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో నాకు అర్ధం కావడం లేదు. అసలు నా ఉద్దేశం హృతిక్ రోషన్ ని అవమానించడం కాదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అయితే ఆ సమయంలో నేను ఉపయోగించిన పదాలు మాత్రం తప్పు. అది నేను అంగీకరిస్తాను’ అంటూ తన తప్పుని ఒప్పుకున్నాడు. అంతర్జాతీయ గుర్తింపుని సంపాదించుకున్న రాజమౌళి.. తన తప్పుని అంగీకరించి క్షమాపణలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తప్పుని అంగీకరించే తన గొప్పతనాన్ని చూసి నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.

కాగా రాజమౌళి ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నాడు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని గెలుచుకోవడంతో, పలు ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ కి చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలు ఇస్తుంది. అలాగే ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా ఓటర్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు.