KGF 3 : కేజీఎఫ్ 3 అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

కేజీఎఫ్ -3 చిత్రం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా దీని గురించి చిత్ర నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చింది. అంతేకాదు సినిమా షూటింగ్ అండ్ రిలీజ్ ఎప్పుడు అనేది కూడా వెల్లడించారు.

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 08:44 PM

KGF 3 : కేజీఎఫ్ 3 అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

KGF 3 : 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్-1’. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించాడు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా అనుకోని రీతిలో విజయాన్ని అందుకుంది. దర్శకుడు చూపించిన స్క్రీన్ ప్లేకి, హీరోయిజంకి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీకి అభిమానులను చేసేసింది.

Raghu Rama Krishna Raju : చిరు, బాలయ్య ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటున్న వైసీపీ ఎంపీ..

దీంతో ‘కేజీఎఫ్-2’కి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో మొదలైని. దాదాపు రూ.1200 వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందు స్థానంలో నిలిచింది. కాగా ఈ సినిమా ఎండింగ్ లో ‘కేజీఎఫ్-3’ కి హింట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఆ సినిమా ఎప్పుడు వస్తుందో అని అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలోనే పలు వేదికల్లో హీరో మరియు దర్శక నిర్మాతలను ఈ చిత్రం గురించి ప్రశ్నలు ఎదురుకుంటున్నారు.

తాజాగా ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు కేజీఎఫ్ ఫ్రాంచైజ్ నిర్మాత. ఇటీవల హీరో యాష్ బర్త్ డే సందర్భంగా ‘కేజీఎఫ్-3’ ఎప్పుడు మొదలు అవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయాల్ని తెలియజేశాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఈ రెండు సినిమాల తరువాత 2025లో ‘కేజీఎఫ్ -3’ షూటింగ్‌ మొదలు కానున్నట్లు తెలియజేశాడు. 2026లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అంటూ వెల్లడించాడు. ఇక ఈ న్యూస్ విన్న కేజీఎఫ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హీరో యష్ అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ మూడో భాగంలో రాకీ భాయ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో త‌న సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడ‌నే పాయింట్‌ తో దర్శకుడు ప్రశాంత్ కథని రెడీ చేస్తున్నాడు.