Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది..

Kaburulu

Kaburulu Desk

December 29, 2022 | 05:09 PM

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది..

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి బిగ్ ట్రీట్ ఇచ్చిన ఆహా టీం, ఇప్పుడు ఇంకాస్త మనసు పెద్దది చేసుకొని ఈ ఎపిసోడ్ ని ఒకరోజు ముందే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా ఈ ఎపిసోడ్ ని ఈ నెల 30న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది ఆహా టీం.

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది..

అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు డిసెంబర్ 29న.. అంటే ఈరోజు రాత్రి 9 గంటలకు పార్ట్-1 ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. అంతేకాదు పార్ట్-2 ని జనవరి 6న రిలీజ్ చేస్తామని ప్రకటించగా, ఇప్పుడు ఆ ఎపిసోడ్ కూడా ముందుకు రానుంది. పార్ట్-2 ని జనవరి 30 లేదా 31 రాత్రి విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.

ఇక ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. బాహుబలి ఆగమనం ఇవాళే జరుగుతుంది అని తెలియడంతో ప్రతి ఒక్కరు ఒకప్పటి వింటేజ్ ప్రభాస్ ని చూసేందుకు సిద్ధమవుతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రామ్‌చరణ్‌ల మధ్య స్నేహం గురించి మరింత తెలుసుకోడానికి ఆశక్తిగా చూస్తున్నారు.