Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది..

Kaburulu

Kaburulu Desk

December 28, 2022 | 09:28 PM

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది..

Prabhas : బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడని తెలిసిన దగ్గర నుండి ఆ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ ఎపిసోడ్ ని ఈ నెల 30న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన ఆహా టీం.. ఈరోజు మరో అదిరిపోయే బహుమతి చెప్పింది.

పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్‌..

ఈ బాహుబలి ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి ఎడిట్ లేకుండా మొత్తం షూటింగ్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయనున్నారు. ది బిగినింగ్ ఎపిసోడ్‌ని ఈ నెల 30న, ది కన్‌క్లూజన్ ఎపిసోడ్‌ని జనవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. కాగా నేడు పార్ట్-1 కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

‘నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి, నేను కూడా నీ మాయలో పడిపోయాను అయ్యా’ అంటూ ప్రభాస్‌తో బాలయ్య చెప్పిన మాటలతో మొదలైన ప్రోమో.. చాలా సరదాగా సాగింది. పెళ్లి సంగతి అడిగితే, రాసి పెట్టి లేదు అని ప్రభాస్ అనడం.. మీ అమ్మకి చెప్పిన మాటలు చెప్పకయ్యా అని బాలయ్య కౌంటర్ ఇవ్వడం.. అందర్నీ నవ్వించింది.

నిన్ను నీ బాయ్ ఫ్రెండ్స్ డార్లింగ్ అని పిలిస్తే, గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని అడిగిన ప్రశ్నకి, ప్రభాస్.. ‘అదేదో టాబ్లెట్ వేసుకుంటున్న సార్ అన్ని మర్చిపోతున్నా’ అంటూ మాటదాటేసాడు. ఇక ప్రోమో ఎండ్ లో రామ్ చరణ్ తో ఫోన్ లో మాట్లాడుతూ బాలయ్య.. ‘ఈ సంక్రాంతి ఫస్ట్ నా సినిమా చూడు, ఆ తరువాత మీ నాన్నగారు సినిమా చూడు’ అంటూ చెప్పిన మాటలు హైలైట్ గా నిలిచాయి.