Prabhas : మారుతి సినిమాలో ప్రభాస్ లుక్ అదుర్స్.. ఫోటో లీక్!

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 04:01 PM

Prabhas : మారుతి సినిమాలో ప్రభాస్ లుక్ అదుర్స్.. ఫోటో లీక్!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ దర్శకుడు మారుతీతో ఒక సినిమాకి ఓకే చెప్పాడన్న ఒక్క వార్త తప్ప, ఆ మూవీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్‌లో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంత ఉందో తెలియక ఫ్యాన్స్ తికమక పడుతున్నారు.

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

ఈ క్రమంలో ఆ వార్తలని నిజం చేస్తూ ఒక ఫోటో.. షూటింగ్ సెట్ నుంచి లీక్ అయ్యింది. ఈ ఫొటోలో ప్రభాస్ తో పాటు దర్శకుడు మారుతీ కూడా ఉన్నాడు. ఇక ప్రభాస్ లుక్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్ కాగా, అది చూసిన అభిమానులు వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు.

హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ హై బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ అంతా.. ఒక పాత థియేటర్ చుట్టూ తిరుగుతుందంటా, దీంతో మారుతీ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఒక థియేటర్ సెట్‌ని వేయించాడని తెలుస్తుంది. మారుతీ కామెడీకి ప్రభాస్ టైమింగ్‌ తోడైతే అభిమానులకు థియేటర్ లో నవ్వుల పండగనే చెప్పాలి.