Pooja Hegde : పూజా హెగ్డే కాలికి గాయం.. అయినా షూటింగ్స్ తో బిజీ..

Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ పక్క సౌత్ సినిమాలు చేస్తూనే మరో పక్క బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోల సరసన ఛాన్సులు తెచ్చుకుంటూ బాలీవుడ్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇక మరో పక్క యాడ్స్ తో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా షూట్ లో పాల్గొంటుంది.
తాజాగా పూజ హెగ్డే తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది. తన కాలికి కట్టు కట్టి ఉన్న ఫోటోని షేర్ చేసి తన కాలికి గాయం అయిందని తెలిపింది. అయినా కానీ షూటింగ్ లో పాల్గొనక తప్పదు అని పోస్ట్ చేసింది. తన కాలికి కట్టు కట్టి ఉంది. మేకప్ రూమ్ లో దాన్ని ఫోటోని తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పూజా హెగ్డే అభిమానులు కంగారు పడుతున్నారు.
Allu Aravind : ‘గీత ఆర్ట్స్’లో గీత అనే పేరు ఎవరిది? సీక్రెట్ బయటపెట్టిన అల్లు అరవింద్
పూజా త్వరగా కోలుకోవాలని, కాలికి గాయం తగ్గేవరకూ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వొచ్చు కదా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.