Pooja Hegde Brother Marriage : ఘనంగా పూజాహెగ్డే అన్నయ్య వివాహం.. మరి బుట్టబొమ్మది ఎప్పుడో?

పూజాహెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. రిషబ్ శివాని అనే అమ్మాయిని గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో వీరి వివాహం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా..................

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 02:12 PM

Pooja Hegde Brother Marriage : ఘనంగా పూజాహెగ్డే అన్నయ్య వివాహం.. మరి బుట్టబొమ్మది ఎప్పుడో?

Pooja Hegde Brother Marriage :  బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ్, తెలుగు, బాలీవుడ్ పరిశ్రమలలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాని మెయింటైన్ చేస్తుంది. బిజీబిజీగా ఉన్న పూజా హెగ్డే తాజాగా వాళ్ల అన్నయ్య పెళ్లి కావడంతో ఒక వారం రోజుల పాటు వర్క్స్ అన్నిటికి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి సందడి చేసింది.

పూజాహెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. రిషబ్ శివాని అనే అమ్మాయిని గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో వీరి వివాహం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. రిషబ్, శివాని వివాహా ఫొటోలు పూజాహెగ్డే కొన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా సోదరుడు తన జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ వారం అంతా చాలా సరదాగా సాగింది. నేను ఆనందభాష్పాలు కార్చాను, చిన్నపిల్లలా కూడా నవ్వాను. అన్నా, నువ్వు నీ జీవితంలో నెక్స్ట్ దశలోకి అడుగుపెడుతున్నవు. ప్రేమ, ఆనందం, శాంతితో నీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తావని భావిస్తున్నాను. శివాని నువ్వు అందమైన, అద్భుతమైన అమ్మాయివి. మా కుటుంబంలోకి నీకు స్వాగతం అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ ఎక్కువ చేశారు..అందుకే నేను చెప్పను.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ కామెంట్స్..

పూజా పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజా అన్నయ్య పెళ్లి అయిపోవడంతో మరి నీ పెళ్ళెప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే పూజా హెగ్డేకి 32 ఏళ్ళు వచ్చాయి. కానీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదన్నట్టు తెలుస్తుంది.